అనుష్క కాళ్లు మొక్కిన హీరో రవితేజ.. కలిసినప్పుడల్లా ఏం చేసేవారంటే..

by sudharani |   ( Updated:2023-12-13 14:40:24.0  )
అనుష్క కాళ్లు మొక్కిన హీరో రవితేజ.. కలిసినప్పుడల్లా ఏం చేసేవారంటే..
X

దిశ, సినిమా: ‘సూపర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. మొదట్లో కాస్త హై గ్లామర్ రోల్స్ చేసినా ఆ తర్వాత నెమ్మదిగా స్టోరీ ప్రయారిటీ సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, మల్లెమాల నిర్మాణంలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. దీంతో విక్రమార్కుడు, బాహుబలి వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటి.. ఇండస్ర్టీలో తన 15 సంవత్సరాల సినీ జర్నీ పూర్తిచేసుకుంది.

ఇక అనుష్క నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంచిదనే విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా చూశాం.. విన్నాం కూడా. అయితే ఒకానొక ఇంటర్వూలో దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్క గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ‘అందరూ అంటుంటారు అనుష్క మంచిది.. మంచిది అని. నిజంగా తను చాలా మంచిది. ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి. ఎంతలా అంటే నేను, ఛార్మి, రవితేజ తనని అమ్మ అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్లకు దండం పెట్టి బ్లెస్సింగ్ తీసుకుంటాం. ఎందుకంటే తనలోని లక్షణాలు మాకు కొన్నైనా రావాలని. చాలా మంచితనం, చాలా తెలివి కలగలిపితే అనుష్క’ అంటూ చెప్పుకొచ్చాడు పూరి.

Advertisement

Next Story