‘విక్రమార్కుడు’ సీక్వెల్‌.. రాజమౌళితో చర్చలపై స్పందించిన రవితేజ

by Prasanna |   ( Updated:2023-10-14 11:47:06.0  )
‘విక్రమార్కుడు’ సీక్వెల్‌.. రాజమౌళితో చర్చలపై స్పందించిన రవితేజ
X

దిశ, సినిమా: అప్ కమింగ్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రచారంలో బిజీగా ఉన్న రవితేజ తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు. గతంలో రాజమౌళితో తీసిన ‘విక్రమార్కుడు’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కాగా తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై స్పందించాడు హీరో. ‘ప్రస్తుతం మరో కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఇందులో బ్రహ్మానందం కూడా ఉన్నాడు. దీని తర్వాత ఓ సైన్స్‌ఫిక్షన్ స్టోరీలో నటించబోతున్నా. ఇక విక్కమార్కుడు సీక్వెల్ గురించి రాజమౌళితో ఎలాంటి చర్చ జరగలేదు. కానీ ఈ మూవీ రెండో పార్ట్ రాబోతుందంటూ వార్తలొచ్చాయి. నిజానికి రాజమౌళితో పనిచేసే అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. నేను అంతే’ అంటూ పరోక్షంగా సీక్వెల్‌కు రెడీ అని చెప్పాడు. అలాగే యాక్షన్, డ్రామా, ఎమోషన్ స్టోరీల్లో నటించినప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే తన అంతిమ లక్ష్యమని చెప్పాడు. చివరగా తన బయోపిక్ వస్తే దానికి ‘మాస్ మహారాజ’ టైటిల్ పెడతాననడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed