రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!

by sudharani |
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల ‘ధమాకా’ చిత్రంతో హిట్ అందుకున్న హీరో.. ఈ ఏడాది ‘ఈగల్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రజెంట్ ‘మిస్టర్ బచ్చన్’ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వివేక్ కూచిబొట్ట నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’కు రీమేక్‌గా వస్తున్న ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇక ఈ మూవీలో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఇందులో నుంచి ‘సితార్’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను జూలై 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు.. ‘మిస్టర్ బచ్చన్’ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడు కాగా.. బాలీవుడ్ ప్రముఖ సంస్థ ‘T - సీరిస్’ దక్కించుకున్నట్లు నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇక.. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుండగా.. ఆ రైట్స్ సొంతం చేసుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయితే.. ఆగస్టు 15న మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వనుంది చిత్ర బృందం.

Advertisement

Next Story

Most Viewed