ఈ భూమి మీద నన్ను ఆపగలిగేవాడున్నాడా.. రవితేజ షేడ్స్ వైరల్

by Vinod kumar |   ( Updated:2023-03-28 13:56:04.0  )
ఈ భూమి మీద నన్ను ఆపగలిగేవాడున్నాడా.. రవితేజ షేడ్స్ వైరల్
X

దిశ, సినిమా: రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఓ వైపు సాఫ్ట్‌ క్యారెక్టర్‌ మరోవైపు వైల్డ్‌ క్యారెక్టర్స్‌లో రవితేజ యాక్టింగ్ వేరే లెవల్లో ఉండగా.. హర్షవర్ధన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.

‘మర్డర్‌ చేయడం క్రైమ్‌, దొరక్కుండా చేయడం ఆర్ట్‌.. ఐ యామ్‌ యాన్ ఆర్టిస్ట్‌.. ఈ భూమి మీద నన్నెవడైనా ఆపగలిగే వాడున్నాడంటే అది నేనే’ అనే డైలాగ్స్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక సుశాంత్‌కు కూడా ఈ సినిమాలో మంచి పాత్రే దక్కినట్లు అర్థమవుతుండగా.. ఇందులో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నాడు. అను ఇమ్మాన్యూయల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్లుగా న‌టించారు.

Also Read...

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు.. సాక్ష్యం ఇదే అంటున్న నెటిజన్స్

Advertisement

Next Story