- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషులు కాదు.. మహిళలకే ఎక్కువ పారితోషికం
దిశ, సినిమా: టీవీ పరిశ్రమను మహిళలే శాసిస్తున్నారంటోంది నటి రవీనా టాండన్. ఈ రోజుల్లో దర్శకులు, నిర్మాతలు, ప్లాట్‌ఫారమ్ హెడ్‌లు, చానల్ హెడ్‌లుగా మహిళలే టాప్ పొజిషన్‌లో ఉంటున్నారన్న ఆమె.. ఈ మార్పుతో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ వేతనం లభిస్తుందని తెలిపింది. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి చిత్ర పరిశ్రమ చాలా నేర్చుకోవాలన్న నటి.. మహిళలకు మంచి వేతనం ఇవ్వడంలోనే కాదు మగాళ్లతో సమానంగా ప్రదర్శనలు ఇప్పించడంలో గొప్పగా పనిచేస్తున్నాయని చెప్పింది.
‘సినిమా పరిశ్రమలో మేము నెమ్మదిగా ఎదుగుతున్నా.. ఖచ్చితంగా అగ్రస్థానానికి వెళ్తాం. మొదటి నుంచి పురుషాధిక్యత కలిగిన పరిశ్రమలో మార్పు వస్తోంది. మాపై కప్పబడిన గాజు పైకప్పును పగలగొట్టాం. మగ సామ్రాజ్యంగా చెప్పుకునే ప్రతి కోటలోకి మేము ప్రవేశించాం. ఫొటోగ్రఫీ, కొరియోగ్రాఫీ, డైరెక్షన్ ఇలా తదితర డిపార్ట్‌మెంట్స్ హెడ్స్‌గా అగ్రస్థానాలలో చేరుకుంటాం’ అని నారి శక్తిని పొగిడేసింది.
Also Read: పేరెంట్స్ విడాకులపై అలయ షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ