‘రావణాసుర’ మంచి ఎగ్జయిటింగ్ థ్రిల్లర్.. మమ్మల్ని కొత్తగా చూస్తారు

by sudharani |   ( Updated:2023-04-03 13:55:36.0  )
‘రావణాసుర’ మంచి ఎగ్జయిటింగ్ థ్రిల్లర్.. మమ్మల్ని కొత్తగా చూస్తారు
X

దిశ, సినిమా: ‘రావణాసుర’ చాలా ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ అన్నాడు నటుడు సుశాంత్. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన ఆయన.. ‘కథ విన్నపుడు మాత్రం చాలా ఆసక్తిగా అనిపించింది. రవితేజను, నన్ను చాలా కొత్తగా చూస్తారు. వెర్సటైల్ యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. రావణాసురలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ నామాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వినలేదు, చూడలేదు. ప్రేక్షకులు కూడా ఈ కొత్తదనం ఫీలవుతారు’ అని తెలిపాడు. రవితేజ టైటిల్ రోల్ పోషించిన సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించగా అభిషేక్ పిక్చర్స్, ఆర్.టీ.టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్‌గా నిర్మించారు. కాగా ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుండగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి: ‘బలగం’ ఎఫెక్ట్.. పదేళ్లకు కలిసిన రెండు కుటుంబాలు

Advertisement

Next Story