హాట్ టాపిక్‌గా రష్మిక బోల్డ్ వీడియో.. స్పందించిన కేంద్ర మంత్రి (ట్వీట్)

by sudharani |   ( Updated:2023-11-07 13:35:47.0  )
హాట్ టాపిక్‌గా రష్మిక బోల్డ్ వీడియో.. స్పందించిన కేంద్ర మంత్రి (ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. డీప్ నెక్ బ్లాక్ డ్రెస్‌లో లిఫ్ట్‌లోకి వచ్చినట్టుగా.. బరువెక్కిన ఎద అందాలతో ఉన్నట్లు రష్మిక వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. అది జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌కు సంబంధించిన వీడియో అని సమాచారం. ఆమె బాడికి ఏఐని ఉపయోగించి రష్మిక ముఖాన్ని పెట్టి వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో ఫేక్ అని తెలియడంతో దీనిపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అమితా బచ్చన్ ‘అలా చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని’ రియాక్ట్ కాగా.. తాజాగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ‘యూజర్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూడాల్సిన చట్టపరమైన బాధ్యత ఆయా వేదికలపై ఉంటుంది. భారత ఐటీ నిబంధనలను ఉల్లంఘించే ఈ కంటెంట్‌ను వెంటనే తీసివేయాలి. ఏదైనా ప్లాట్‌ఫారమ్‌పై తప్పుడు సమాచారం పోస్ట్ చేయబడితే, దానిని 36 గంటల్లోగా తొలగించాలి. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై రూల్ 7 వర్తింస్తుందని.. ఈ సంస్థలను కోర్టుకు తీసుకెళ్లే హక్కు బాధితులకు ఉంది’ అంటూ కేంద్ర మంత్రి తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed