తన లైఫ్ లో విజయ్‌ దేవరకొండ ఎంత ముఖ్యమో బయటపెట్టిన రష్మిక..

by Kavitha |   ( Updated:2024-02-01 05:12:06.0  )
తన లైఫ్ లో విజయ్‌ దేవరకొండ ఎంత ముఖ్యమో బయటపెట్టిన రష్మిక..
X

దిశ, సినిమా: ప్రస్తుతం ‘యానిమల్’ సక్సెస్ ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది రష్మిక. దీంతో వరుస ఇంటర్వ్యూలో ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన కోస్టార్ట్స్ అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్ ల గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండపై కూడా వైరల్ కామెంట్స్ చేసింది.

నటి మాట్లాడుతూ ‘విజు, నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి పనికి అతని సలహా తీసుకుంటాను. నాకు అతని అభిప్రాయం చాలా ముఖ్యం. ప్రతిదానికీ ఎస్ అని చెప్పే వ్యక్తిన కాదతడు. కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. ఇది మంచిది.. ఇది కాదు.. నేను ఇలా అనుకుంటున్నాను.. ఇది అనుకోవడం లేదు అంటూ సలహా ఇస్తాడు. నా మొత్తం జీవితంలో విజయ్ నాకు సపోర్ట్ చేసినట్లు ఎవరూ చేయలేదు. అందుకే అతన్ని నేను చాలా చాలా గౌరవిస్తాను’ అని రష్మిక చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ‘ రష్మిక కామెంట్స్ వింటుంటే తమ మధ్య అందరూ అనుకుంటున్నట్లు ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed