Rashmika Mandanna: దాని గురించి నేను పెద్దగా చదువుకోలేదంటున్న.. రష్మిక

by Prasanna |   ( Updated:2023-02-15 09:34:06.0  )
Rashmika Mandanna: దాని గురించి నేను పెద్దగా చదువుకోలేదంటున్న.. రష్మిక
X

దిశ, సినిమా: స్టార్ నటి రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప ది రూల్' కోసం రంగంలోకి దిగిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను పోషించే క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను ఇప్పటిదాకా నటించిన పాత్రలు ఒక ఎత్తయితే.. ఈ శ్రీవల్లి మరో ఎత్తు. కెరీర్‌లో ఇలాంటి క్యారెక్టర్లు చేయడం చాలా బాగుంటుంది. నటనాపరంగా నిరంతరం సవాళ్లు ఎదురైతేనే ప్రయోజనాలుంటాయి. మొదట్లో కఠినమైన పాత్ర చేయగలనా? అనే భయం కలిగినప్పటికీ ఆ తర్వాత మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని సెట్లోకి అడుగుపెడతా. అయితే యాక్టింగ్ గురించి నేను పెద్దగా చదువుకోలేదు. నాకు తెలిసినదల్లా డైరెక్టర్ చెప్పినట్లు పాత్రలో ఇమిడిపోయి అనుభూతి పొందడమే. అందుకే నేను నటించిన ప్రతి క్యారెక్టర్ కొంతకాలంపాటు నాతో ప్రయాణం చేస్తుంది' అంటూ తన అనుభవాలను షేర్ చేసుకుంది.

Read more:

Tollywood : అసలైన కింగ్ అతనొక్కడే: స్టార్ హీరోపై తమన్న ప్రశంసలు

Advertisement

Next Story