" వారసుడు " సినిమాపై అలిగిన Rashmika Mandana.. ఎందుకో తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-01-22 07:34:07.0  )
 వారసుడు   సినిమాపై  అలిగిన Rashmika Mandana.. ఎందుకో తెలుసా ?
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'వారసుడు' సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో తనను ఎక్కవ సేపు ప్రేక్షకులకు చూపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. తనది అభిమానులను అలరించే పాత్ర అయినప్పటికీ రెండు మూడు సన్నివేశాలకే పరిమితం చేశారని వాపోయింది. తాను నటించిన బాలీవుడ్ మూవీ 'మిషన్ మజ్ను' ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'దళపతి విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నిజానికి 'వారసుడు' సినిమాలో నేను చేసింది ఏమీ లేదు. అది నాకు బాగా తెలుసు. కానీ, విజయ్ సార్‌తో కలిసి నటిస్తున్నపుడు ఎక్కవ సేపు స్క్రీన్‌పై ఉండాలని కోరుకున్నా. కానీ, అనుకున్నట్లు అన్నీ కుదరవని నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఏది ఏమైనా ఈ సినిమాతో విజయ్ దగ్గర చాలా నేర్చుకున్నా. ఈ చిత్రంలో అవకాశం లభించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా' అంటూ తన అభిప్రాయాలు షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : తనకు తానే కాస్లీ గిఫ్ట్ ఇచ్చుకున్న నటి.. ఏంటో తెలుసా?

Advertisement

Next Story