ఎల్లో కలర్ లెహంగాలో రష్మిక మందన్నా.. దానిపై ఉన్న ఇష్టాన్ని బయటపెడుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-07-13 06:55:54.0  )
ఎల్లో కలర్ లెహంగాలో రష్మిక మందన్నా.. దానిపై ఉన్న ఇష్టాన్ని బయటపెడుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్నా అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యర్నేని నిర్మిస్తున్నారు. అయితే పుష్ప-2 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా రాబోతుంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన రష్మిక, శ్రీవల్లి లుక్స్, అల్లు అర్జున్ గ్లింప్స్ భారీ రెస్పాన్స్‌కు దక్కించుకున్నాయి.

అయితే రష్మిక మందన్నా ఓ వైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. పలు ఫొటోలు షేర్ చేస్తూ అందరినీ మైమరిపిస్తోంది. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. ఎల్లో కలర్ లెహంగా ధరించి సంప్రదాయ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. అలాగే ‘‘పసుపు నాకు ఇష్టమైన రంగు ఎందుకో తెలుసా?.. ఎందుకంటే ఇది సూర్యరశ్మి, సూర్యుని పువ్వులు, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను సూచిస్తుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక అవి చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed