- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి డీప్ ఫేక్ బారిన పడిన రష్మిక.. ఇప్పుడు మరింత అసభ్యకరంగా ఎడిట్.. (వీడియో)
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కేవలం ఈ హీరోయిన్ వీడియో మార్ఫింగ్ మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్ హీరోయిన్ల వీడియోలు, ఫొటోలు కూడా మార్ఫింగ్ చేశారు. దీనిపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖ సినీ సెలబ్రిటీలు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడు ఎవరో తెలిస్తే మాత్రం కఠినమైన శిక్ష విధించాలని అన్నారు. అయితే తాజాగా రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది. మరోసారి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ ద్వారా రష్మిక ఫేస్ ను మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఒక అమ్మాయి డాన్స్ చేస్తోన్న వీడియోకు రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేశారు.
కొంతమంది నిజంగా రష్మికనే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతోన్న రష్మిక ఫేస్ క్లియర్ గా డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తుంది. ఈ వీడియో చూసిన రష్మిక ఫ్యాన్స్.. ‘దయచేసి నేషనల్ క్రష్ రష్మిక పై డీప్ ఫేక్ వీడియోలు చేయకండి’. అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.