నేషనల్ క్రష్ రష్మికకు అస్వస్థత.. నేను అలా చేయడం ఆపట్లేనంటూ ఆసక్తికర పోస్ట్

by Hamsa |   ( Updated:2024-07-17 11:37:12.0  )
నేషనల్ క్రష్ రష్మికకు అస్వస్థత.. నేను అలా చేయడం ఆపట్లేనంటూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో చలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి తన అందం, అభినయంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రష్మిక విపరీతమైన పాపులారిటీతో దూసుకుపోతుంది.

2021లో అల్లు అర్జున్‌తో కలిసి జంటగా నటించిన ఈ అమ్మడు ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయింది. ప్రజెంట్ హిందీ, తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీకి షేక్ చేస్తోంది. తెలుగులో రష్మిక మందన్న అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకి సీక్వెల్‌గా రాబోతుండటంతో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇక రష్మిక షూటింగ్స్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. పలు పోస్టులు పెడుతూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు పెట్టిర పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘చాలా అస్వస్థతగా ఉంది. కానీ నేను కొందరిని ఫూల్స్ చేయడం ఆపడం లేదు’’ అనే క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ఫ్రీ హెయిర్‌లో అందమైన గులాభీ పువ్వులను పెట్టుకుని నవ్వుతున్న స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. అమ్మడు అందానికి అంతా మంత్రముగ్ధులు అవుతూ.. పొగుడుతున్నారు.

(Video Link Credits to rashmika mandanna Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed