- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప2 సినిమాకు రష్మిక గుడ్ బై!
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందనా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛలో, గీతా గోవిదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ, వరస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే యానిమల్ మూవీతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న కన్నడ బ్యూటీ, తాజాగా పుష్ప2 మూవీ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ,రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక శ్రీవల్లీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.
అయితే ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా రష్మిక పుష్ప2లో ఓ పాటకు సంబంధించిన ఫూటింగ్‌ను పూర్తి చేసుకుందంట. ఆ పాట కూడా ఎంతో అద్భుతంగా రావడంతో, ఈ బ్యూటీ పుష్ప2కు గుడ్ బై చెప్పి మరో సినిమాకు షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప2తోపాటు రెయిన్ బో, ధనుష్, శేఖర్ కమ్మల సినిమాల్లో నటిస్తోంది.ప్రస్తుతం తెలుగులో పుష్ఫ2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంద. ఇక ఇటీవల యానిమల్ మూవీతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.