అఫిషియల్‌గా బయటపడ్డ రష్మిక, విజయ్ ప్రేమ వ్యవహారం.. వీడియో రిలీజ్ చేసిన రౌడీ హీరో

by sudharani |
అఫిషియల్‌గా బయటపడ్డ రష్మిక, విజయ్ ప్రేమ వ్యవహారం.. వీడియో రిలీజ్ చేసిన రౌడీ హీరో
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు రష్మిక, విజయ్ దేవరకొండ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకతంలో వచ్చిన ‘గీతా గోవిదం’ సినిమా టైంలో విజయ్, రష్మిక ప్రేమలో పడినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. వీటిపై స్పందించిన వీరిద్దరూ మేము మంచి స్నేహితులం, మా మధ్య వేరే ఎలాంటి రిలేషన్ లేదంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

అంతే కాకుండా వీరిద్దరి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. దాంతో పాటు.. వీరు విడివిడిగా ఫొటోలు దిగడం. వాటిని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకోవడం జరుగుతొంది. కానీ వాటి బ్యాక్‌గ్రౌండ్స్ మాత్రం సేమ్ ఉండటంతో.. రష్మిక, విజయ్ ఒకే చోట ఉన్నరని అర్థం అయిపోతుంది నెటిజన్లకు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరగ్గా.. మరోసారి దొరికొపోయారు విజయ్, రష్మిక. తాజాగా రష్మిక ఓ నెమలి ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో ‘బ్యూటిఫుల్’ అంటూ పోస్ట్ చేసింది. అలాగే.. విజయ్ కూడా రష్మిక పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికి తన ఇన్‌స్టా స్టోరీలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ గురించి వీడియో షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో సేమ్ నెమలి ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కాగా.. ప్రస్తుతం విజయ్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా యూఎస్‌లో ప్రీమియర్ షోలు ఉండటంతో అక్కడే ఉన్నట్లు తెలుస్తుండగా.. రష్మిక కూడా యూఎస్ వెళ్లిందా..? అంటే ఇద్దరు కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా.? అనే కొత్త రచ్చ నెట్టింట స్టార్ట్ అయింది. అంతే కాకుండా.. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రిలీజ్ కూడా రష్మిక బర్త్‌డే రోజు ఉండటం విశేషం. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు అఫీషియల్ అయిపోయిందని కోడై కూస్తుంది సోషల్ మీడియా.


Advertisement

Next Story

Most Viewed