చీరను ఇలా కూడా కట్టొచ్చు అంటూ బ్లాక్ శారీలో ఎక్స్పోజింగ్ చేస్తున్న రాశీఖన్నా.. ఫోటోలు

by Kavitha |
చీరను ఇలా కూడా కట్టొచ్చు అంటూ బ్లాక్ శారీలో ఎక్స్పోజింగ్ చేస్తున్న రాశీఖన్నా.. ఫోటోలు
X

దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ఎంతో మందిని కట్టిపడేసింది. అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అదేవిధంగా గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుణ్మణై 4’ అనే తమిళ్ మూవీలో నటించింది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతు హంగామా చేస్తుంది. ఈ క్రమంలోనే పెట్టిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీనిలో బ్లాక్ శారీలో ఎక్స్‌పోజింగ్ చేస్తూ చీరను ఇలా కూడా కట్టొచ్చు అంటూ ఫోటోలకి పోజులిచ్చింది. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు రాశీ ఖన్నాలో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు అని.. సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి.

Advertisement

Next Story

Most Viewed