అలాంటి కథల్లో నటించాలంటే భయమేస్తుంది.. Aditi Rao Hydari

by Dishaweb |   ( Updated:2023-07-23 11:38:19.0  )
అలాంటి కథల్లో నటించాలంటే భయమేస్తుంది.. Aditi Rao Hydari
X

దిశ, సినిమా : చారిత్రక కథల్లో భాగం కావాలంటే భయం వేస్తుందంటోంది అదితి రావు హైదరి. ఇటీవల ఆమె నటించిన జీ5 హిస్టారికల్ టీవీ సిరీస్ ‘తాజ్: డివైడెబ్ బై బ్లడ్’లో అనార్కలి పాత్ర పోషించిన ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఓ సమావేశంలో తన కెరీర్ అండ్ కొత్త ప్రాజెక్టుల ఎంపిక గురించి మాట్లాడిన బ్యూటీ.. ‘ప్రజల జ్ఞాపకాలలో నిలిచిపోయే చిరస్మరణీయమైన పాత్రలు, చరిత్రలోని పలు భాగాల గురించి చెప్పే కథలు, షోలలో నటించాలంటే కొన్నిసార్లు భయంగా ఉంటుంది.

మనుసులో ఆందోళనగానూ ఉంటుంది. తాజ్‌లో పోషించిన అనార్కలి పాత్ర షోకే హైలెట్ అని కొంతమంది చెబుతుంటే సంతోషంగా అనిపించింది. అదే సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా దారుణమై ట్రోలింగ్ ఎదుర్కొవాల్సివుండేదని భయమేసింది. మొత్తంగా నన్ను ఈ ప్రాజెక్టులో భాగం చేసినందుకు జీ5 బృందానికి, నటీనటులు, అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read: ఆభరణాలకే అందం తెచ్చిన Sreemukhi.. ఈ డ్రెస్‌లో మెరిసిపోతున్నావంటూ కామెంట్స్

Advertisement

Next Story