- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్.. వాటిని చూపిస్తూ ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం.. రెండు రోజులకు ముందు రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి. తొందరలో దీపిక తల్లి కాబోతుండగా.. ఈ క్రమంలోనే విడాకుల వార్తలు రావడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. తాజాగా, రణ్‌వీర్ డైవర్స్ వార్తలపై పరోక్షంగా స్పందించాడు.
ముంబైలోని జ్యూవెలరీ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్న రణ్‌వీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ నాకు ఇష్టమైన రింగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి మా పెళ్లికి నా భార్య గిఫ్ట్‌గా తొడిగిన రింగ్. అలాగే రెండోది ప్లాటినమ్ మా ఎంగేజ్‌మెంట్‌కు దీపిక నా చేతికి పెట్టింది. ఈ రెండు నాకు చాలా చాలా ఇష్టమైన ఉంగరాలు’’ అని వాటిని చూపిస్తూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా తన భార్యపై ఉన్న ప్రేమను చెప్పి విడాకులు వార్తలకే క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు డిలీట్ ఎందుకు చేశాడో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
Read More...
తెరపైకి మరోసారి విడాకుల ఇష్యూ.19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సింగర్ సునీత గురించి ఇవి తెలుసా?