ఆలియా చెప్పులను దేవుడి దగ్గర పెట్టిన రణ్‌బీర్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో)

by Hamsa |   ( Updated:2023-04-23 09:53:59.0  )
ఆలియా చెప్పులను దేవుడి దగ్గర పెట్టిన రణ్‌బీర్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ వరుస తమ పాపను చూసుకుంటూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్ దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తల్లి పమేలా చోప్రా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. తాజాగా, బాలీవుడ్ క్యూట్ ఆలియా భట్, రణ్‌బీర్ కూడా వెళ్లారు. ఆయన ఇంట్లోకి వెళ్లే సమయంలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శుక్రవారం రాత్రి ఆలియా భట్, రణ్‌బీర్ ఆదిత్యా చోప్రాను పరామర్షించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆలియా ఇంటి ముందు చెప్పులను వదిలి లోపలికి వెళ్లింది. ఆ తర్వాత రణ్‌బీర్ ఆ చెప్పులను చేతిలో పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి ఓ గుడి ముందు పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read..: షారుఖ్‌తో ఆ ముద్దు సీన్.. నేను భయపడ్డట్లే జరిగింది


Advertisement

Next Story

Most Viewed