నాకు ‘పుష్పరాజ్’ పాత్ర పోషించాలనుంది: బాలీవుడ్ హీరో

by Vinod kumar |
నాకు ‘పుష్పరాజ్’ పాత్ర పోషించాలనుంది: బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ సహనటుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు బన్నీ నటించిన ‘పుష్పరాజ్’ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న ఆయన.. రీసెంట్‌గా ఓ మీడియా సమావేశంలో పలు చిత్రాల గురించి ప్రస్తావిస్తూ ‘పుష్పరాజ్’ క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘నాకు ‘పుష్ప’లో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ చేయాలనుంది. ఆ పాత్ర నన్నేంతో ప్రభావితం చేసింది. ఇలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. అలాగే ‘గంగుబాయి కతియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు నన్ను ఆకట్టుకున్నాయి’ అంటూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed