- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం, మాంసానికి దూరంగా ఉంటున్న రణ్‌బీర్.. ఎందుకో తెలుసా?
X
దిశ, సినిమా: ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘రామాయణం’కోసం బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతెన కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కనిపించనుండగా.. సీతగా సాయిపల్లవిని ఫైనల్ చేశారు. అయితే ఇందులో శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తున్న రణ్‌బీర్ పాత్ర పవిత్రత దృష్ట్యా సినిమా కంప్లీట్ అయ్యేవరకూ మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు హీరోతోపాటు మూవీ టీమ్ అంతా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవిత్రంగా, భక్తితో, ప్రేమతో రామకథను తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ భావిస్తున్నాడని ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Advertisement
Next Story