అభిమానులను అట్రాక్ట్ చేస్తున్న 'తు ఝూటీ మైన్ మక్కర్' టీజర్

by Hajipasha |   ( Updated:2022-12-14 13:45:02.0  )
అభిమానులను అట్రాక్ట్ చేస్తున్న తు ఝూటీ మైన్ మక్కర్ టీజర్
X

దిశ, సినిమా: శ్రద్ధా కపూర్ అండ్ రణ్‌బీర్ కపూర్ జంటగా వస్తున్న మూవీ 'తు ఝూటీ మైన్ మక్కర్' (Tu Jhoothi Main Makkar). ఫన్ అండ్ లవ్ స్టోరీగా లవ్ రంజన్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ రిలీజ్ చేసిన మేకర్స్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. గురుగ్రామ్‌లోని సైబర్‌హబ్‌లో ఎదురెదురుగా నడుచుకుంటూ వచ్చి కౌగిలించుకున్న హీరో హీరోయిన్ మూమెంట్స్ చూస్తే ఇద్దరూ ఒకరిపట్ల ఒకరూ అమితమైన ప్రేమను కలిగివున్నట్లు అర్థమవుతుండగా.. బ్యూటీఫుల్ లుక్స్ అభిమానులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ఈ టీజర్‌ను నెట్టింట పోస్ట్ చేసిన శ్రద్ధా.. 'And the title is Finally Here !!! Dekhoooo' అంటూ క్యాప్షన్ ఇస్తూ మురిసిపోయింది. దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. అప్‌డేట్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం' అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా 2023 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ MORE

పఠాన్ సినిమాకు బిగ్ షాక్.. షారూఖ్ మూవీపై హిందూ మహాసభ కీలక నిర్ణయం

Advertisement

Next Story