ఓ యాప్‌లో అమ్మాయితో పరిచయం.. వారంలోనే అలా చేశానంటూ రానా షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
ఓ యాప్‌లో అమ్మాయితో పరిచయం.. వారంలోనే అలా చేశానంటూ రానా షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత విరాటపర్వం, నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. అయితే రానా ఇటీవల రానానాయుడు సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రజెంట్ రానా నాయుడు సీక్వెల్‌లో నటిస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రానా నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ సాధించడంతో.. ఆయన టీమ్‌తో చిట్ చాట్ చేశారు.

ఈ క్రమంలో తన పెళ్లి ఎలా జరిగిందో చెప్తూ రానా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘కరోనా సమయంలో కొత్త వాళ్లతో పరిచయం పెంచుకోవాలని పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. యాప్ చూస్తుండగా.. మిహికా పరిచయం అయింది. ఆ తర్వాత వారానికే ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అప్పుడు మిహికా ఇది నిజమా, అబద్దమా వీడు మెంటలోడా? అని కన్‌ఫ్యూజ్ అయింది. ఇదే నా జీవితంలో వైల్డెస్ట్ థింగ్ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రానా కామెంట్స్ వైరల్ అవుతుండగా..ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story