ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన రానా

by Anjali |   ( Updated:2023-10-19 12:03:12.0  )
ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన రానా
X

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘కల్కి 2898AD’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అమెరికాలోని కామిక్ కాన్ వంటి ప్రెస్టీజియస్ స్టేజ్‌పై రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్‌లో రానా కూడా పాల్గొన్నాడు. దీంతో రానా ఈ సినిమాలో నటిస్తున్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇదే ప్రశ్న రానాను అడిగితే.. ‘టాలీవుడ్‌లో ఏ సినిమా అయిన బౌండరీ దాటి బయటకి వెళ్లాలంటే వాళ్లకు ముందు నేను ఉంటాను. వాళ్లకు కావాల్సిన సహాయం చేస్తాను’ అని చెప్పాడు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Advertisement

Next Story