ఛీ..ఛీ రానా నాన్‌వెజ్ పిచ్చితో అవికూడా తిన్నాడా.. ఇదేం కక్కుర్తి అంటున్న నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2024-05-06 06:18:26.0  )
ఛీ..ఛీ రానా నాన్‌వెజ్ పిచ్చితో అవికూడా తిన్నాడా.. ఇదేం కక్కుర్తి  అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా రామానాయుడు మనవడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా రానా బాహుబలి సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా షాకింగ్ చేశాడు.

‘‘నేను పెద్ద నాన్ వెజిటేరియన్.. ఫుడ్ తినకపోతే అస్సలు ఉండలేను. అయితే బాహుబలి నుంచి ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రకు మారడానికి మూడు నెలల పాటు వెజ్ తిన్నాను. ఆ మూడు నెలలు నాకు ఎంత కష్టంగా గడిచాయో దేవునికి మాత్రమే తెలుసు. షూటింగ్ అయిపోయాక వెంటనే నాంపల్లిలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాను. దానికి నా ఫ్రెండ్ ఓనర్. అయితే ముందే ఫోన్ చేసి హలీం చేపించమని అడిగాను. దీంతో వాడు నేను వెళ్లిన వెంటనే తీసుకొచ్చాడు.

అది నోట్లో పెట్టుకోగానే నా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. నేను నాన్ వెజ్‌లో అన్ని రకాలు తిన్నాను. అందుబాటులో ఉండే అన్ని నాన్ వెజ్ వంటకాలు తింటాను. ఒకానొక సమయంలో నేనేం తిన్నానో చేప్తే మీరు భయపడిపోతారు. నాన్ వెజ్ పిచ్చితో నేను పాములు కూడా తిన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఛీ ఛీ రానాకు నాన్ వెజ్ అంటూ అంత ఇష్టమా? పాములు తినేంత కక్కుర్తి ఏంటని షాక్ అవుతున్నారు.


Read More...

అక్కడి వాళ్లకు మహేశ్ బాబు భార్య ఎవరో తెలుసు కానీ ప్రభాస్ తెలియదు.. డార్లింగ్‌పై రానా కామెంట్స్ వైరల్

Advertisement

Next Story