నా రోజును చాలా అందంగా మార్చిన నా స్టార్‌కు అంటూ సీనియర్ హీరోయిన్ పోస్ట్.. ఆ ఇద్దరి ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2023-07-25 15:05:42.0  )
నా రోజును చాలా అందంగా మార్చిన నా స్టార్‌కు అంటూ సీనియర్ హీరోయిన్ పోస్ట్.. ఆ ఇద్దరి ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రస్తుతం రాజకీయంగా చాలా బిజీగా ఉంటుంది. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సత్తూ చాటుకుంటూ దూసుకుపోతుంది. ఇదిలా ఉండే.. రమ్యకృష్ణ మంగళవారం మధ్యాహ్నం కుమారుడు రిత్విక్‌ను తీసుకుని చిత్తూరు జిల్లా నగరిలోని మంత్రి రోజా ఇంటికి వెళ్లారు. అక్కడ రోజా దంపతులు రమ్యకృష్ణకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం రోజా కుటుంబంతో సరదాగా గడిపిన రమ్యకృష్ణకు వెళ్లే ముందు రోజా చీర పెట్టి పంపారట. ఈ విషయాన్ని నేరుగా మంత్రి రోజా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ మేరకు ‘‘మంచి స్నేహితులు నక్షత్రాల లాంటి వారు, మీరు ఎల్లప్పుడూ వారిని చూడలేరు, కానీ వారు ఎల్లప్పుడూ ఉన్నారని మీకు తెలుసు, ఈ రోజు వచ్చి నా రోజును చాలా అందంగా మార్చిన నా స్టార్‌కి హృదయపూర్వక స్వాగతం, ఆ రోజుల్లో జీవితం ఎలా ఉండేదో, ఆ చిరునవ్వులు, మనం కలుసుకున్నప్పుడు, ఎంత సమయం గడిచిపోయిన, నా బెస్ట్ రీ తో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో ఆనందం లభిస్తుంది @meramyakrishnan ఎల్లప్పుడూ అద్భుతమైన’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed