Rambha : టాలీవుడ్ బడా హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ!

by Anjali |
Rambha : టాలీవుడ్ బడా హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రంభ గురించి సుపరిచితమే. ఈ భామ ‘‘అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, ముద్దుల ప్రియుడు, పచ్చతోరణం, మయాబజార్, ఏవండీ ఆవిడ వచ్చింది, హిట్లర్, శ్రీరామ చంద్రులు, కోదండరాముడు’’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గానే కాకుండా ‘‘భైరవద్వీపం, యమదొంగ, నాగ, దేశముదురు, హలో బ్రదర్, శ్రీకృష్ణార్జున విజయం’’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ స్టెప్పులేసింది. రంభ తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ భాషల్లో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ మలేషియా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.

ఇన్నాళ్లకు రంభ మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టబోతుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వయసు పెరుగుతున్నా కూడా చెక్కు చెరగని అందంతో చాలా మంది సీనియర్ స్టార్ హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామలు ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. కాగా రంభ కూడా ఓ స్టార్ హీరో మూవీలో ముఖ్య పాత్రలో మెరవనుందని సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే త్వరలోనే అప్డేట్ రానుందని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed