మూడు భాగాలుగా ‘రామాయణం’.. ‘ఆది పురుష్‌’లా అయితే కాదుగా..!

by Prasanna |   ( Updated:2023-12-17 12:16:54.0  )
మూడు భాగాలుగా ‘రామాయణం’.. ‘ఆది పురుష్‌’లా అయితే కాదుగా..!
X

దిశ, సినిమా: తాజాగా ‘యానిమల్’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు రణ్‌బీర్ కపూర్. ఇక అతను తదుపరి ప్రాజెక్ట్ ‘రామాయణం’ సినిమాలో నటించనున్నాడు. నితీశ్ తివారి దర్శకత్వంలో మహా ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో.. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుండగా.. ‘కేజిఎఫ్’ హీరో యశ్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించి కొన్ని అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.

2024లో ‘రామాయణం’ షూటింగ్ మొదలు కానుందట. ‘యానిమల్’ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంటున్న రణ్ బీర్ వచ్చే సంవత్సరంలో మార్చిలో ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని సమాచారం. అలాగే ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే మూవీ చేస్తున్న యశ్ కూడా ఈ షూటింగ్ పూర్తి అయ్యాక ‘రామాయణం’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే రణ్ బీర్, సాయి పల్లవి, యశ్‌ల 3D స్కాన్ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి, ఆస్కార్ విన్నింగ్ VFX కంపెనీ DNED పనిచేస్తోంది. అంతే కాదు ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇదంతా విన్న నేటిజన్లు ‘ఆదిపురుష్’ లాగా మాత్రం తీయకండి.. ‘రామాయణం’లో ఉన్నది మాత్రమే చూపించండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story