- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajamouli: షూటింగ్ లేనప్పుడు జక్కన్న ఆ పని చేస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన భార్య రమా రాజమౌళి
దిశ, సినిమా: మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు వచ్చి వెళ్లినా ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతారు. ఎందుకంటే, ఎవరు చేయలేని సాహసాలు చేస్తూ సినీ లవర్స్ కి కొత్తగా చూపించాలని చాలా కష్ట పడుతుంటాడు. మన తెలుగు మూవీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి తర్వాత మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ, ఎవరు ఊహించని విధంగా మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనిలో రాజమౌళి సన్నిహితులు , ఫ్రెండ్స్ ఆయన గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జక్కన్న షూటింగ్ లేని సమయంలో ఏం చేస్తాడో ఆయన సతీమణి రమా రాజమౌళి చెప్పింది. రమా రాజమౌళి మాట్లాడుతూ.. షూటింగ్ ఏ పని లేకుండా చాలా బద్దకంగా ఉంటారు. పడుకోరు ఏదోకటి ఆలోచిస్తునే ఉంటారు. ఒక్కోసారి సరదాగా గేమ్స్ కూడా ఆడుతుంటారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే రాజమౌళి చాలా లేజీ అని .
రాజమౌళి ఈ మాటలపై స్పందిస్తూ.. నాకు ఆటలు మెడిటేషన్ లాంటిది. క్రికెట్ ఎక్కువగా ఆడతాను. ఆటలు ఆడేటప్పుడు నా ఫోకస్ మొత్తం బాల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సమయం దొరికినప్పుడు వ్యవసాయం చేస్తుంటాను అని తెలిపారు.