Hero Ram Pothineni : టాలీవుడ్ లో ఏ హీరో టచ్ చేయలేని రికార్డు క్రియేట్ చేసిన రామ్ పోతినేని

by Prasanna |
Hero Ram Pothineni : టాలీవుడ్ లో ఏ హీరో టచ్ చేయలేని రికార్డు క్రియేట్ చేసిన రామ్ పోతినేని
X

దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో రామ్ పోతినేని కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే హీరోలందరిలో అందగాడు. కెరీర్ మొదట్లో ఈ హీరో లవ్ సినిమాలనే చేసేవాడు అప్పట్లో లవర్ బాయ్ అని పిలిచేవారు. ఆ తర్వాత తనను పూర్తిగా మార్చుకుని మాస్ సినిమాలను కూడా చేసాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చూసిన తర్వాత ఇన్ని రోజులు ఈ మాస్ యాంగిల్ ఎందుకు బయటకు తీయలేదంటూ కామెంట్స్ చేసారు. ఇదిలా ఉండగా రామ్ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

రామ్ పోతినేని టాలీవుడ్ లో ఏ హీరో టచ్ చేయలేని రికార్డు క్రియేట్ చేసాడు. తెలుగులో నటించిన సినిమాలు హిందీలో విడుదలై యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. ‘స్కంధ’ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు బ్రేక్ చేసింది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని వ్యూయర్ షిప్ రామ్ కి ఉంది. ‘ది వారియర్’, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజా, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించాయి. ఇలా ఒకటి కాదు రెందు కాదు ఏకంగా 9 సినిమాలు యూట్యూబ్ లో వంద మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి.



Next Story

Most Viewed