బుల్లితెర నటితో రామ్ పోతినేని పెళ్లి.. అలా లవ్‌లో పడిపోయాడా?

by Jakkula Samataha |   ( Updated:2024-03-17 12:10:16.0  )
బుల్లితెర నటితో రామ్ పోతినేని పెళ్లి.. అలా లవ్‌లో పడిపోయాడా?
X

దిశ, సినిమా : దేవదాసు సినిమాతో అమ్మాయిల మనసు దోచుకున్న హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన నటనతో అందరినీ మాయచేస్తాడు. అయితే తాజాగా ఈ కుర్ర హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే, రామ్, బుల్లితెర నటిని ప్రేమించడమే కాకుండా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంట.

అసలు విషయంలోకి వెళ్లితే..రామ్‌కి పెళ్లి చేయాలని వాళ్ల ఫ్యామిలీ ఎంతగానో ట్రై చేస్తుంది. ఎన్నో సంబంధాలు చూసినా, రామ్ వాటిని ఏదో వంక పెట్టి క్యాన్సల్ చేస్తున్నాడు. కాగా, దానికి కారణం శ్రీసత్యనే అంటున్నారు నెటిజన్స్.గతంలో వీరిద్దరూ ఓ షోలో పాల్గొన్న సమయంలో శ్రీ సత్య రామ్ పోతినేనికి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. నార్మల్ గా అయితే ఒక హీరో బుల్లితెర నటిని లవ్ చేస్తున్నాడు అంటే అందరూ షాక్ అవుతారు. కానీ వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉన్నందున ఎవరు మాట్లాడడం లేదు. అంతేకాకుండా శ్రీ సత్య కి రామ్ పోతినేని అంటే ఎనలేని ప్రేమ. దీంతో రామ్‌ను పెళ్లి చేసుకోవాలని, ఈ బ్యూటీ తెగ ఆశపడుతుదంట. సత్యకు రామ్ ఎక్కడ కనిపించినా తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ వస్తుందంట. దీంతో ఆమె ప్రేమకు ఫిదా అయిపోయిన రామ్, సత్య ప్రేమలో పడిపోయాడంటూ నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా త్వరలో ఫ్యామిలీతో మాట్లాడి వీరు పెళ్లికూడా చేసుకోబోతున్నారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఇది చూసిన కొందరు ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేస్తున్నారు.ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read More..

భారీ గుడ్ న్యూస్.. ‘కార్తికేయ-3’ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరో నిఖిల్

Advertisement

Next Story