- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Gopal Varma : ‘పవన్ కల్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ నన్ను కామెంట్ చేయలేదు’
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఎన్నికలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే వ్యూహం సినిమాను తీస్తున్నట్లు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను నమ్మిన నిజాన్ని సినిమాగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర నుంచి అన్ని అంశాలు ఉంటాయని తెలిపారు. అంతేకాదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కూడా సినిమాలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేసే హక్కు ఉందని అలాగే తాను నమ్మిన నిజాన్ని అభిప్రాయాన్ని సినిమాగా తీసి విడుదల చేస్తామని తెలిపారు.
తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఎంతో ఇష్టమని ప్రకటించారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తప్ప తనపై మెగా ఫ్యామిలీలో ఎవరూ విమర్శలు చేయలేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పవన్ కల్యాణ్ గురించి స్పందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్‌పై వివాదం సరికాదన్నారు.హీరోలు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటే తప్పేముంది అని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.
Read More: చరణ్‌తో మాట్లాడితేనే నా మనసు కుదుట పడుతుంది: Tamannaah Bhatia