నా పెళ్ళాం దెయ్యం.. అంటున్న రామ్ గోపాల్ వర్మ

by Kavitha |   ( Updated:2024-03-21 15:27:45.0  )
నా పెళ్ళాం దెయ్యం.. అంటున్న రామ్ గోపాల్ వర్మ
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ మూడున్నర దశాబ్దాలు అవుతుంది.ఆయన దర్శకత్వంలో మూవీ వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. తొలి సినిమా ‘శివ’ తోనే సంచలనం రేపిన అతడు.. ఆ తర్వాత ‘క్షణక్షణం’, ‘గోవిందా గోవింద’, ‘రాత్రి’, ‘దెయ్యం’, ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్’ లాంటి సినిమాలతో దేశం మెచ్చే డైరెక్టర్ అయ్యాడు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆర్జీవీ సినిమాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తీసిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అన్ని కాంట్రవర్సీ మూవీస్ తీస్తు తన పరువు తానే పోగొట్టుకుటున్నాడు.

ఈ మధ్యే ‘వ్యూహం’, ‘శపథం’ లాంటి సినిమాలు తీసిన అతడు.. తాజాగా మరో కొత్త మూవీ ‘నా పెళ్ళాం దెయ్యం’ అనే టైటిల్ తో అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో ఓ తీసి పడేసినట్లుగా తాళి, బ్యాక్‌గ్రౌండ్లో కిచెన్‌లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూడొచ్చు.

ఇంతకు ముందే ఓ ఇంటర్వ్యూలో ‘నా పెళ్ళాం దెయ్యం’ పేరుతో ఓ సినిమా తీయబోతున్న అని తెలిపారు వర్మ. ఈ మూవీలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని, ఆ తర్వాత తన పెళ్ళాం దెయ్యంగా మారుతోందని తెలుసుకుంటాడంటూ స్టోరీ పాయింట్‌ను వర్మ వెల్లడించాడు. అంతే కాదు ‘పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్ళాం దెయ్యమనే అంటారు. నాకు నిజ జీవితంలో అలాగే అనిపించింది’ అని కూడా ఆర్జీవీ అన్నాడు. ప్రజంట్ ఈ మూవీకి టైటిల్ ఇంకా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Advertisement

Next Story

Most Viewed