రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సాంగ్ వాయిదా?

by Hamsa |   ( Updated:2023-10-21 08:18:27.0  )
రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సాంగ్ వాయిదా?
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎన్.శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం‘గేమ్ చేంజర్’. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంతకాలం వాయిదా పడింది. అయినప్పటికీ 60 శాతానికి పైగానే షూట్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక మిగిలినది కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తారట. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల టాక్ నడిచిన సంగతి తెలిసిందే. కానీ పాట విడదలపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో దసరా కానుకగా ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

Advertisement

Next Story