ఉపాసన డెలివరీకి ఫేమస్ గైనకాలజిస్ట్‌ను సిద్దం చేసిన చరణ్..!

by Hamsa |   ( Updated:2023-02-24 04:21:29.0  )
ఉపాసన డెలివరీకి ఫేమస్ గైనకాలజిస్ట్‌ను సిద్దం చేసిన చరణ్..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి ఇంట త్వరలో మనవడు, మనవరాలో అడుగు పెట్టే క్షణం కోసం మెగా ఫ్యామిలీ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఉపాసన డెలివరీ ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని రామ్ చరణ్ చెప్పేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు.

బుధవారం 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం ఆస్కార్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ షోలో చరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా సంభాషించారు. గుడ్ మార్నింగ్ షోలో అమెరికా ఫెమస్ గైనాకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ కో హోస్ట్‌గా చేశారు. చరణ్ ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని డెలివరీకి జెన్నిఫర్‌ను అందుబాటులో ఉండమని కోరాడు. అందుకు జెన్నిఫర్ కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా మీతో ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్న, మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం తనకు చాలా గౌరవం అని అన్నారు. రామ్ చరణ్ ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Advertisement

Next Story

Most Viewed