- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan : అప్పుడే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకున్నా.. కానీ రాజమౌళినే
దిశ, సినిమా : మెగా హీరో రామ్ చరణ్ తన సినీ కెరీర్ ప్లాన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. నిరంతరం ఏదైనా కొత్తగా చేయాలని తపనపడతానని ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’కు ముందు బ్రేక్ తీసుకోవాలనుకున్నానని, అయితే అనుకోకుండా రాజమౌళినుంచి పిలుపురావడంతో నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పాడు. ‘‘మగధీర’ సినిమాలో నేనొక స్టూడెంట్ లాగే ఫీల్ అయ్యాను. ‘ఆర్ఆర్ఆర్’కు కూడా విద్యార్థినే. రాజమౌళి నాకు ప్రిన్సిపాల్, గురువు. ఆయన నన్నేంతో విజ్ఞానవంతుడిని చేశాడు. ఆయన కాలేజిలోకి ఒక స్టూడెంట్‌గా అడుగుపెట్టాను. నటుడిగా కాదు. ఆయన చిత్రాల్లో భాగమైనందుకు గొప్పగా ఫీల్ అవుతున్నా. రాజమౌళి అందించిన జ్ఞానాన్ని పది కాలలపాటు ఉపయోగించుకుంటా’ అంటూ జక్కన్నతో తనకున్న అనుబంధం గురించి వివరించాడు. చివరగా తారక్ తాను ఎప్పటినుంచో మంచి స్నేహితులమన్న చెర్రీ.. ఎన్‌టీఆర్ ఎప్పుడూ తనపక్కనే ఉండాలని కోరుకుంటానన్నాడు.