Ram Charan: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న రామ్ చరణ్

by Prasanna |   ( Updated:2023-03-15 05:54:44.0  )
Ram Charan: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్ : పోయిన సంక్రాంతికి వారసుడు సినిమా థియోటర్ల విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలుసు. కానీ ఈ సారి సంక్రాంతికి ముందే ప్లాన్ చేస్తానంటున్నాడు దిల్ రాజు. RC 15 భారీ పాన్ ఇండియా సినిమా 2024సంక్రాంతికి రీలిజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ k సినిమా సంక్రాంతి బరిలో ఉంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జనవరి 12 న రీలిజ్ చేయబోతున్నారు. దానితో RC 15 రిలీజ్ ఉంటుందా ? అనే సందేహం ఉండేది. కానీ ఈ సారి కూడా దిల్ రాజు తగ్గేదే లే అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రామ్ చరణ్ సినిమాని జనవరి 10 న విడుదల చేయనున్నారట. దీని పై మార్చి 27 న క్లారిటీ రానుంది. ఆ రోజు చెర్రీ పుట్టిన రోజు సంధర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు రీలిజ్ డేటును అనౌన్స్ చేసే ప్లాన్లో ఉన్నారట. ఒక వేళ ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటే బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ , చెర్రీకి పాన్ ఇండియా రేంజ్ ఉంది.

Also Read: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. అప్పుడే ప్రకటిస్తాడంట?

Advertisement

Next Story