ఆ ఒక్క డైలాగ్‌తో చెల్లి నిహారిక-సమంత పరువు తీసిన రామ్ చరణ్.. ఆ విషయం చరణ్‌కు ముందే ఎలా తెలుసు?

by Anjali |
ఆ ఒక్క డైలాగ్‌తో చెల్లి నిహారిక-సమంత పరువు తీసిన రామ్ చరణ్.. ఆ విషయం చరణ్‌కు ముందే ఎలా తెలుసు?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గురించి సుపరిచితమే. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఈయన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు.

ఇక అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లైన 11 ఏళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ బుజ్జాయికి క్లీంకార అని నామకరణం చేశారు. మెగా ప్రిన్సెస్ జన్మించి 7 నెలలు దాటుతోన్న ఇప్పటివరకు ఫేస్ రిలీల్ చేయలేదు. క్లీంకార ఫేస్ చూడటం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే..

ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఏమవుతుందో చూడాలి. ఇందులో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చగా.. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చరణ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది పెళ్లి బంధానికి కట్టుబడి ఉండటం లేదు. చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లైన ఏడాది, రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. అయితే రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రంలో ‘ప్రేమ అనేది జీవితాంతం ఉండదు జాన్’ అని ఓ డైలాగ్ చెప్తాడు.

ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్ ఈ డైలాగ్‌ను గుర్తుచేసుకుని.. విడాకులకు ట్యాగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. చెర్రీ ఈ సినిమాలో నిజజీవితంలో జరిగేవే చెప్పాడు. సమాజంలో సేమ్ అలాగే జరుగుతుంది. ప్రేమ ఎక్కువ కాలం అస్సలు ఉండదు. ముఖ్యంగా సెలబ్రిటీలకైతే అస్సలు ఉండదు. అని కొంతమంది కామెంట్స్ చేయగా.. మరికొంతమంది.. సమంత అండ్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటారని మన చరణ్ అన్నకు ముందే తెలుసు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed