- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముఖ్యమంత్రిని కలిసిన రామ్ చరణ్-ఉపాసన.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్సెస్ క్లీంకారకు 6 నెలలు పడటంతో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించడం కోసం రామ్ చరణ్ దంపతులు ముంబయికు వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కార్యాలయాన్ని సందర్శించారు. చరణ్ దంపతులు మర్యాదపూర్వకంగా సీఎంను కలిసి పూల బొకే అందించి, శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత కాసేపు సీఎంతో మాట్లాడారు. తమను రిసీవ్ చేసుకునే పద్ధతి నచ్చిందంటూ.. మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకు శ్రీకాంత్ షిండేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ... సీఎంతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే ముంబయి ప్రజలు తమపై కురిపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ వ్యక్తిగత విషయాల కోసమే సీఎం ను కలిశారంటూ సోషల్ మీడియాలోని పలువురు జనాలు చర్చించుకుంటున్నారు.
సినిమాల విషయానికొస్తే..
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ ఆలస్యమవుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
Read More..
టాప్ హీరోల జాబితాలో ఏకైక టాలీవుడ్ హీరో.. అరుదైన ఘనత సాధించిన ఎన్టీఆర్