టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న షాకింగ్ న్యూస్..చిరుతో రామ్ చరణ్ ఫైటింగ్!

by Jakkula Samataha |
టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న షాకింగ్ న్యూస్..చిరుతో రామ్ చరణ్ ఫైటింగ్!
X

దిశ, సినిమా : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం టాప్ ఇండస్ట్రీ గా ఎదిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్నాయి. అంతే కాకుండా ఏదైనా పండుగ వస్తే చాలు స్టార్ హీరోల పోటీ మాములగా ఉండటంలేదు. ముందే అనౌన్స్ చేసుకోకపోతే, కావాల్సిన డేట్‌న సినిమా విడుదల చేయాలంటే భయపడాల్సిన సిట్యూవేషన్స్ ఎదురు అవుతున్నాయి. అందుకే చాలా మంది నిర్మాతలు సినిమా అనౌన్స్ చేసిన వెంటనే, మూవీ రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేసి పెడుతున్నారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్‌తో రిలీజ్ కానున్న సినిమాలు ఎక్కువగా లేవు. కానీ ఆగస్టు నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలు రానున్నాయి. పుష్ప2, గేమ్ చేంజర్, విశ్వంభర,తండేల్, కల్కి, ఇంకా పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏమిటంటే? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ మూవీని డిసెంబర్‌లో కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో చిరంజీవి విశ్వంభర మూవీ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో ఏంటీ చరణ్, చిరు ఇలా పోటీకి వస్తున్నారు. అప్పుడే వీరిద్దరి మధ్య ఫైటింగ్ మొదలైందా? అని ముచ్చటించుకుంటున్నారు జనాలు

Advertisement

Next Story