‘ఇండియన్-2’ ప్రమోషన్స్ జోరు పెంచిన రకుల్.. అమ్మడు లుక్‌కు నెటిజన్లు ఫిదా

by Hamsa |   ( Updated:2024-07-09 09:43:41.0  )
‘ఇండియన్-2’ ప్రమోషన్స్ జోరు పెంచిన రకుల్.. అమ్మడు లుక్‌కు నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే కెరీర్ పిక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు.. తన ప్రియుడు నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమైన రకుల్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఈ అమ్మడు పెళ్లి తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం లోకనాయకుడు కమల్ హాసన్ ‘ఇండియన్-2’. ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవాని, నెడుముడి వేణు, కాజల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఇప్పటికే ఇండియన్-2 నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, అన్ని భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో.. చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో.. తాజాగా, రకుల్ ఇండియన్-2 ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తుంది. తన ఇన్‌స్టా వేదికగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ లెహంగాలో మత్తెక్కించే చూపులతో రకుల్ కుర్రాళ్లను ఫిదా చేసింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. సూపర్ అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed