- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లీజ్ అతన్ని వదిలేయండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాడు..
దిశ, సినిమా : బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌కు బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ మద్దతుగా నిలిచింది. గత నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించినపుడు ఎవరూ గొంతు ఎత్తలేదన్న ఆమె.. 'బిగ్ బాస్'లోకి వెళ్లి హైలైట్ అవుతున్నాడనే కారణంగా టార్గెట్ చేసి దాడిచేస్తున్నారని అభిప్రాయపడింది. 'అతనిపై విమర్శలు చేయడం సరైనది కాదు. అతను దోషా లేదా నిర్దోషా నేను చెప్పలేను. నాకు తెలియదు. కానీ గత నాలుగేళ్లుగా అతనికి సరైన అవకాశాలు రాలేదని మాత్రం తెలుసు. ఎందుకంటే అతనికి ఇప్పటికే శిక్ష పడింది. ఇన్నాళ్లు పబ్లిక్‌లో లేడు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు 'బిగ్ బాస్'కి వెళ్లడంతో తమ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఆయనపై ఏదేదో మాట్లాడుతున్నారు. అతన్ని వదిలేయండి. వివాదాస్పద వ్యక్తులనే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌గా తీసుకుంటారు. ఒక వేళ నేను బిగ్ బాస్‌కి వెళితే కచ్చితంగా ఆరోపణలు నిజమో కాదో అడిగి తెలుసుకుంటాను. విమర్శలు ఇలాగే కొనసాగితే సాజిద్ ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయి' అని చెప్పుకొచ్చింది.