- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పిన రజినీకాంత్
దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అనారోగ్యానికి గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో చికిత్స పొందిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా తన అనారోగ్యంపై స్పందించి.. తన కుటుంబానికి ధైర్యం చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి రజినీకాంత్ ధన్యవాదాలు చెప్పారు.
ప్రస్తుతం రజినీకాంత్ నేరుగా ఇంటికి వెళ్లినట్లు సమాచారం. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో డాక్టర్లు రజనీకాంత్‌కు స్టెంట్ అమర్చారు. ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా సూపర్‌స్టార్‌కు స్టెంట్ వేసినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. తమ అభిమాన నటుడు అనారోగ్యం నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో..రజనీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు.
Read More...
Rajinikanth: చిక్కుల్లో రజినీకాంత్ ‘వెట్టైయాన్’ మూవీ.. కారణం ఏంటంటే?