ఐశ్వర్యతో హీరో ధనుష్ సీక్రెట్ లవ్.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం?

by Anjali |
ఐశ్వర్యతో హీరో ధనుష్ సీక్రెట్ లవ్.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. హీరో ధనుష్‌ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు (లింగ, యాత్ర) కూడా జన్మించారు. వివాహనంతరం భార్యను దర్శకురాలిగా తీర్చిదిద్దాడు. ధనుష్ తన ఫస్ట్ మూవీ 3 లో హీరోగా నటించారు. అలాగే ఐశ్వర్య డైరెక్ట్ చేసిన రెండో చిత్రం ‘వై రాజా వాయ్‌’ లో కొక్కి కుమార్‌గా అతిధి రోల్‌లో మెరిశాడు.

పెళ్లి తర్వాత ధనుష్ ఉత్తమ నటుడిగా రెండు సార్లు జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. కెరీర్ పరంగా మంచి సక్సెస్‌తో దూసుకుపోతున్న క్రమంలో ఏమైందో తెలియదు కానీ ఐశ్వర్య-ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు. అయితే ఐశ్వర్యతో విడాకులు అయిప్పటికీ ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలను చూస్తున్నాడు. రీసెంట్‌గా తెరకెక్కిన జైలర్ కూడా వీక్షించాడు.

తాజాగా రజినీకాంత్ గెస్ట్ పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ మూవీపై పోస్ట్ పెట్టాడు. ఈ చిత్రానికి ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేసింది. దీనిపై ధనుష్ పోస్ట్ పెట్టడంతో వీరిద్దరు త్వరలో కలవబోతున్నారా ఏంటి? సీక్రెట్ గా వీరి రిలేషన్ మెయింటెన్ చేస్తున్నారు కావచ్చు. విడాకుల తర్వాత కూడా ధనుష్.. రజనీకాంత్ సినిమాలు చూస్తున్నారంటే ఏదో తేడా కొడుతోంది. అంటూ సోషల్ మీడియాలో జనాలు పలు విధాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story