బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రోరింగ్.. నాలుగు రోజుల్లో 300 కోట్లు వసూల్

by Mahesh |
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రోరింగ్.. నాలుగు రోజుల్లో 300 కోట్లు వసూల్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. నెల్సన్ దీలిప్.. దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈ నెల 10వ తేదీన విడుదలైన జైలర్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసేందుకు ధియేటర్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే జైలర్ సినిమా అన్ని భాషల్లో కలిపి ౩౦౦ వందల కోట్లను వసూల్ చేసింది.

రోబో 2.0 తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా ఈ సినిమా నిలిచింది. దీంతో పాటు కేవలం ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 100 కోట్లు కొల్లగొట్టింది. ఈ తమిళంలో వరుస మూడు రోజుల్లో 29, 20, 26, కోట్లను రాబట్టిన ఆదివారం ఏకంగా 31 కోట్లు కాబట్టి వందకోట్ల క్లబ్ లో చేరింది. అలాగే తెలుగు కన్నడలో కూడా ఈ సినిమా భారీ స్పందన వస్తుంది. ఇవాళ ఒక్కరోజైతే.. మళ్లీ రేపు హాలిడే కావడంతో జైలర్ భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశం ఉంది.

Read More: Devara తో OG పోటీ అంటే సాహసం అనే చెప్పాలి.. వైరల్ అవుతున్న Sri Reddy కామెంట్స్

Next Story