- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rajeev Kanakala : మూడు నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లాను
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు సినిమాలలో నటుడిగా రాజీవ్ కనకాలకు ఎంతో మంచి పేరు ఉంది. విలన్ పాత్రల్లో నటించి తన నటనతో మంచి పేరు సంపాడించకున్నాడు.ఇక ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల, సుమకు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారు, అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సందర్భంగా ఈయన ఆమె గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తాను అమ్మ నాన్న చెల్లి అందరిని కోల్పోయానని తెలిపారు.తన చెల్లెలు శ్రీలక్ష్మి క్యాన్సర్బారిన పడి మరణించారు. ఆమెకు క్యాన్సర్ ఉన్న విషయం తెలియగానే ట్రీట్మెంట్ ఇప్పించాము.దాదాపు క్యాన్సర్ నుంచి బయటపడింది.
ఇక అంతాబాగుంది అనుకునే సమయంలో కామెర్లు వచ్చాయి. అప్పుడే లాక్ డౌన్ పడింది. ఎటు వెళ్లలేని పరిస్థితి. రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోయింది. ఆసుపత్రికి చేర్చుదాం అనుకున్నా డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వలేదు. మూడు నెలలు ప్రాణాలతో పోరాడి మరణించింది, ఆ మూడు నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లాను అంటూ ఏమోషనల్ అయ్యారు. ఇక నా చెల్లి మరణించిన తర్వాత తన పిల్లల బాధ్యతను సుమే తీసుకుంది. మనకు ఇప్పుడు నలుగురు పిల్లలంటూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈన్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.