Rajasaab: డార్లింగ్ లేకుండా సెట్స్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

by Kavitha |
Rajasaab: డార్లింగ్ లేకుండా సెట్స్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోంది. అయితే ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాగా ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్‌లు నటిస్తున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా రాజాసాబ్ షూట్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు. అందులో భాగంగా షూటింగ్ సెట్లో మూవీ యూనిట్ మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ జరిపారు. ఆ ఫొటోలను షేర్ చేస్తూ డైరెక్టర్ మారుతి ఆమెకు టీమ్‌లోకి వెల్కమ్ చెప్పాడు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రాజా సాబ్ సెట్ కావడంతో ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో పాల్గొనలేదా? ప్రభాస్ ఎక్కడ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed