Mahesh తో సినిమా కథ రివీల్ చేసిన జక్కన్న.. గ్లోబల్ లెవల్‌లో ప్లాన్

by Hajipasha |   ( Updated:2022-09-13 13:20:51.0  )
Mahesh తో సినిమా కథ రివీల్ చేసిన జక్కన్న.. గ్లోబల్ లెవల్‌లో ప్లాన్
X

దిశ, సినిమా: 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. RRR సినిమాతో మరోసారి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఆయన డైరెక్షన్‌లో వచ్చిన చిత్రాలను టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. ఈ సందర్బంగా మాట్లాడాడు దర్శకధీరుడు. 'నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తీస్తున్నాను. ఇది గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ మూవీ' అని తెలిపారు. కాగా ఈ మాటల ద్వారా మహేష్ ప్రపంచ దేశాలన్నీ చుడుతూ సాహసాలు చేసే పాత్రలో నటించనున్నట్టు అర్థమవుతుందని అంటున్నారు నెటిజన్స్. ఇక గతంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్-రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని చెప్పిన విషయం తెలిసిందే.

Also Read : 'ఊ అంటావా' పాటకు అల్లు అర్జున్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా ?

Also Read : చిరు కోసం వెనక్కి తగ్గిన నాగార్జున.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story