Rajamouli: దర్శక ధీరుడు భార్యకు యాక్సిడెంట్.. అలా చూసి ఏడ్చేశాను అంటూ రాజమౌళి ఎమోషనల్

by Kavitha |
Rajamouli: దర్శక ధీరుడు భార్యకు యాక్సిడెంట్.. అలా చూసి ఏడ్చేశాను అంటూ రాజమౌళి ఎమోషనల్
X

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈయన బాహుబలి సినిమాతో.. తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో.. మన తెలుగు చిత్రాలను ఆస్కార్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇలాంటి గొప్ప దర్శకుడి గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి.. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య రాజమౌళి పై డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీలో భాగంగా రాజమౌళి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలో రాజమౌళి ఓ ఎమోషనల్ సంఘటనని షేర్ చేసుకున్నాడు.

రాజమౌళి మాట్లాడుతూ.. “మగధీర షూటింగ్ సమయంలో మేము ఒక రిమోట్ ప్లేస్‌లో డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందరికీ గాయాలు అయ్యాయి. నా భార్య రమకి నడుము కింద స్పర్శ కూడా పోయింది. ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు. తెలిసిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేస్తూ నా భార్యని చూస్తూ ఏడ్చేసాను. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయినట్లు రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story