మిల్కీ బ్యూటీ Thamannah పాటకు రాజమాత డ్యాన్స్ (వీడియో)

by Anjali |   ( Updated:2023-07-31 14:37:06.0  )
మిల్కీ బ్యూటీ Thamannah పాటకు రాజమాత డ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం రెండు ఇండస్ట్రీల్లోని అగ్ర హీరోల సరసన నటిస్తోంది. తెలుగు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌తో పాటు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆగష్టు నెలలోనే విడుదల కానున్నాయి. ఈ క్రమంలో రెండు చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటూ తమన్నా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల రజినీకాంత్ జైలర్ నుంచి విడుదలై కావాలా సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఇన్‌స్టా్గ్రామ్‌లో విస్తృతంగా ఈ పాటపై రీల్స్ చేస్తున్నారు. తాజాగా.. టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story